బస్తర్‌కు చెందిన మద్దారామ్ సంకల్పం ముందు పోలియో ఓడిపోయింది. రెండు కాళ్లు చచ్చుపడినా క్రికెట్లో పాకుతూ వెళ్లి పరుగులు తీయడం ఇటీవల నెట్టింట వైరల్ అయింది. స్ఫూర్తిదాయకం అని ఆ వీడియోను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ పోస్టు చేశాడు. తాజాగా ఆ అబ్బాయికి ఓ లేఖతో పాటు క్రికెట్ కిట్టు బహుమతిగా పంపించాడు లిటిల్ మాస్టర్.
"నువ్వు ఆటను ఆస్వాదిస్తున్న విధానం చూస్తుంటే నాకు చాలా సంతోషమేసింది. నీకు, నీ స్నేహితుల మీద నాకున్న ప్రేమకు రూపమే ఈ కానుక. ఎప్పుడూ ఆడుతూనే ఉండూ.."