తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్మిత్​ నాలుగోసారి ఔట్​..  వాగ్నర్ అరుదైన రికార్డు - wagner bowler

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కివీస్ బౌలర్​ నీల్​ వాగ్నర్ మరో రికార్డు అందుకున్నాడు​. కెరీర్​లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. శనివారం మ్యాచ్​లో స్టార్​ బ్యాట్స్​మన్​​ స్మిత్​​ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు.

left-arm pacer Neil Wagner Becomes Second Fastest New Zealand bowler to Pick 200 Test Wickets
స్మిత్​ను నాలుగుసార్లు ఔట్​.. కెరీర్​లో అరుదైన రికార్డు

By

Published : Dec 28, 2019, 5:01 PM IST

మెల్​బోర్న్​లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్​ బౌలర్ నీల్​​ వాగ్నర్ ఆసక్తికర ఫీట్​ నమోదు చేశాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్​ల్లోనూ ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​ను పెవిలియన్​ చేర్చి, వావ్​ అనిపించుకున్నాడు​. ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్​లో టాప్​-2లోనే కాకుండా టెస్టుల్లో మంచి ఫామ్​లో ఉన్న ఈ బ్యాట్స్​మన్​ను, ఈ బౌలర్​ ఇన్నిసార్లు ఔట్​ చేయడం చర్చనీయాశంగా మారింది. వాగ్నర్ టెస్టు బౌలర్ల​ ర్యాంక్​లో మూడో స్థానంలో ఉన్నాడు.

ఖాతాలో 200 వికెట్లు

ఈ మ్యాచ్​లో స్మిత్​ను ఔట్​ చేసిన నీల్​ వాగ్నర్​... న్యూజిలాండ్​ తరఫున అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ ఫార్మాట్​లో 200 పైగా వికెట్లు తీసిన కివీస్​ బౌలర్లలో 7వ వాడిగా నిలిచాడు. గతంలో రిచర్డ్​ హ్యాడ్లీ, క్రిస్​ కెయిన్స్​, డేనియల్​ వెటోరీ, క్రిస్​ మార్టిన్​, టిమ్​ సౌథీ, ట్రెంట్​ బౌల్ట్​ ఈ ఘనత సాధించారు.

అంతేకాకుండా ఈ ఫీట్​ను వేగంగా అందుకున్న రెండో కివీస్​ బౌలర్​గా, ప్రపంచ వ్యాప్తంగా 20వ బౌలర్​గా పేరు తెచ్చుకున్నాడు. 46 టెస్టుల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు నీల్. గతంలో హ్యాడ్లీ 44 టెస్టుల్లో ఈ రికార్డు సాధించి, న్యూజిలాండ్​ నుంచి అగ్రస్థానంలో ఉన్నాడు.

న్యూజిలాండ్​ బౌలర్​ వాగ్నర్​

జడేజా తర్వాతే

33 ఏళ్ల వాగ్నర్​.. ఎడమ చేతి వాటం బౌలర్లలో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో బౌలర్​గా ఘనత సాధించాడు. ఈ జాబితాలో భారత లెఫ్టార్మ్​ స్పిన్నర్​ రవీంద్ర జడేజా(44 ఇన్నింగ్స్​ల్లో) తొలిస్థానంలో ఉన్నాడు.

జడేజా తర్వాతి స్థానంలో వాగ్నర్​

బాక్సింగ్​డే టెస్టులో భాగంగా మూడో రోజు ఆటముగిసే సమయానికి 456 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్​లో 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది కంగారూ జట్టు. ఫలితంగా ఈ టెస్టులోనూ గెలిచేందుకు అవకాశాలు మెరుగుపర్చుకుంటోంది. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్​లో తొలి టెస్టు నెగ్గింది ఆసీస్​.

ABOUT THE AUTHOR

...view details