తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ను వీడటం కష్టంగా అనిపించింది: తాహిర్

పాకిస్థాన్ జట్టుకు ఆడకపోవడం తనను ఎంతగానో బాధించిందని తెలిపాడు దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. పాక్​లో అవకాశాలు రాకపోవడం వల్ల తాహిర్ సౌతాఫ్రికా వచ్చి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

'పాకిస్థాన్ తరఫున ఆడకపోవడం విచారకరం'
'పాకిస్థాన్ తరఫున ఆడకపోవడం విచారకరం'

By

Published : Jul 23, 2020, 5:35 AM IST

పాకిస్థాన్ జట్టుకు ఆడకపోవడం తనను ఎంతగానో బాధించిందని తెలిపాడు దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. అండర్​-19 వరకు ఆడినా తనకు అక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించలేదని వెల్లడించాడు. 2011 ప్రపంచకప్​లో సౌతాఫ్రికా జట్టులోకి అరంగేట్రం చేశాడు.

"నేను లాహోర్​లోనే క్రికెట్ ఆడటం ప్రారంభించా. అక్కడ నేను ప్రధాన పాత్ర పోషించా. కానీ నాకు జాతీయ జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. నేను దక్షిణాఫ్రికా రావడానికి నా భార్య సుమయ్యా దిల్దార్ కారణం. కానీ పాకిస్థాన్​ను వీడడం మాత్రం కష్టంగానే అనిపించింది."

-ఇమ్రాన్ తాహిర్, దక్షిణాఫ్రికా క్రికెటర్

తాహిర్ ఫ్యామిలీ 2006లో దక్షిణాఫ్రికాకు వెళ్లింది. ఆ తర్వాత సఫారీ జట్టులో స్పిన్నర్ల కొరత ఉండటం వల్ల తాహిర్ రూపంలో వారికి ఓ మంచి లెగ్ స్పిన్నర్ దొరికినట్లైంది. అలా 2011 ప్రపంచకప్​ ద్వారా జట్టులోకి అరంగేట్రం చేసిన ఇతడు టోర్నీలో ఆ జట్టు తరఫున సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్​గా నిలిచాడు.

ఇప్పటివరకు 95 వన్డే మ్యాచ్​ల్లో 156 వికెట్లు సాధించాడు తాహిర్. 2019 ప్రపంచకప్​ సమయంలో వన్డే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details