మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్కు ప్రపంచకప్ అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతమున్న క్రికెటర్లతో పాటు యువకులకు ఆదర్శంగా ఉన్నాడు. తాజాగా మహీని స్ఫూర్తిగా తీసుకునే తాను ముందుకెళుతున్నట్లు తెలిపాడు అండర్-19 2020 ప్రపంచకప్ కెప్టెన్ ప్రియమ్ గార్గ్.
"నేను ధోనీ సార్ను ఫాలో అవుతా. ఆయన నాకు స్ఫూర్తి. బ్యాటింగ్లోనైనా కెప్టెన్సీలోనైనా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా. మ్యాచ్ ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రశాంతంగా ఉండటం ధోనీ సార్ నుంచి నేర్చుకున్నా. ఆయన బ్యాటింగ్ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నా. కెప్టెన్గా ఉంటూ మ్యాచ్ను ఎలా మలుపుతిప్పుతాడో తెలుసుకున్నా."