తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​పై లాథమ్ శతకం.. కివీస్ స్కోరు 173/3 - eng vs nz

హామిల్టన్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 3వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. టామ్ లాథమ్ సెంచరీతో రాణించాడు.

లాథమ్

By

Published : Nov 29, 2019, 11:10 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్‌ 173/3 స్కోరు చేసింది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టామ్ లాథమ్‌ (101*) శతకంతో ఆకట్టుకోగా.. టేలర్ (53) అర్ధశతకంతో రాణించాడు.

ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి కివీస్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టేలర్‌తో కలిసి లాథమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 116 పరుగులు చేశారు. టేలర్‌ను క్రిస్‌ వోక్స్‌ (2/41) ఔట్‌ చెయ్యడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.

ఆఖరి సెషన్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. టీ విరామం తర్వాత ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లోనే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో మొదటి రోజు ఆట 54.3 ఓవర్లు మాత్రమే సాగింది. రెండో రోజు ఆట 30 నిమిషాలు ముందుగా ప్రారంభమవుతుందని అంపైర్లు తెలిపారు. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై కివీస్‌ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: సయ్యద్ మోదీ టోర్నీలో శ్రీకాంత్ ఔట్... సెమీస్​లో సౌరభ్

ABOUT THE AUTHOR

...view details