తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతి తక్కువ వయసులో క్యాబ్ అధ్యక్షుడిగా - sports news

క్యాబ్ నూతన​ అధ్యక్షుడిగా ఎన్నికైన అవిషేక్ దాల్మియా.. పిన్న వయసులో ఈ పదవి చేపట్టిన వ్యక్తిగా ఘనత సొంతం చేసుకున్నాడు.

అతి తక్కువ వయసులో క్యాబ్ అధ్యక్షుడిగా
అవిషేక్ దాల్మియా

By

Published : Feb 5, 2020, 9:34 PM IST

Updated : Feb 29, 2020, 7:58 AM IST

క్యాబ్(క్రికెట్ అసోసియేషన్​ ఆఫ్ బెంగాల్) నూతన అధ్యక్షుడిగా అవిషేక్ దాల్మియా(38) ఎంపికయ్యాడు. అతి తక్కువ వయసులో ఈ పదవికి ఎంపికైన వ్యక్తిగా నిలిచాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దివంగత పారిశ్రామికవేత్త జగ్​మోహన్​ దాల్మియా కుమారుడే ఇతడు.

జగ్​మోహన్ దాల్మియా.. గతంలో రెండుసార్లు క్యాబ్ అధ్యక్షుడిగా, ఐసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుతం క్యాబ్​ అధ్యక్షుడిగా ఎన్నికైన అవిషేక్.. ఈ పదవికి ఎంపికైన 18వ వ్యక్తి.

క్యాబ్‌ ముఖ్య కార్యదర్శిగా స్నేహాషిష్‌ గంగూలీ ఎంపికయ్యాడు. ఇతడు టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సోదరుడు కావడం విశేషం.

Last Updated : Feb 29, 2020, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details