వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా అస్వస్థతకు గురయ్యాడు. ఛాతి నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాడు. రెండేళ్ల క్రితం ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడీ ట్రినిటాడ్ క్రికెటర్. ఈరోజు రెగ్యులర్ చెకప్ ఉండగా ఆసుపత్రికి వెళ్లే లోపు మరోసారి గుండె నొప్పి వచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ వెస్టిండీస్ క్రికెటర్ 131 టెస్టులాడి 52.89 సగటుతో 11 వేల 953 పరుగులు సాధించాడు. 299 వన్డేల్లో 40.17 సగటుతో 10 వేల 405 పరుగులు చేశాడు.
టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక పరుగులు 400 సాధించిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. 2004లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ అత్యధిక పరుగుల (501) రికార్డు లారా పేరిటే ఉంది.