2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఫిక్సింగ్ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందానంద. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రభుత్వం.. తక్షణ విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు ప్రస్తుత లంక క్రీడామంత్రి దుల్లాస్ అలహప్పెరుమా.
ఫైనల్ల్లో లంక జట్టు కావాలనే ఓటమి పాలైందని, భారత్కు కప్పు అమ్మేసిందని మహిందానంద అన్నారు. ఈ మాటల్ని కొట్టిపడేసిన మాజీ క్రికెటర్లు సంగక్కర, జయవర్ధనే.. ఆధారాలు ఉంటే చూపించాలని చెప్పారు. మహిందానంద వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు.