తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మా జట్టుకు ధోనీ లాంటి ఫినిషర్​ అవసరం' - మహెందర్​ సింగ్ దోని

ఆస్ట్రేలియాకు ధోనీ లాంటి ఫినిషర్​ అవసరమని ఆ జట్టు కోచ్​ జస్టిన్​ లాంగర్​ అభిప్రాయపడ్డాడు. త్వరలో న్యూజిలాండ్​తో వన్డే సిరీస్ ముందున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

Langer in search of 'white-ball finisher' like Dhoni
'మా జట్టుకు ధోని లాంటి ఫినిషర్​ అవసరం'

By

Published : Mar 11, 2020, 9:50 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ లాంటి ఫినిషర్.. తమ జట్టుకు అవసరమని అన్నాడు ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్. మిడిలార్డర్​లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆటగాళ్లు పోటీ పడాలని సూచించాడు.

"గతంలో ఆసీస్ జట్టుకు మైక్​ హస్సీ, మైకేల్ బెవాన్​ లాంటి ఫినిషర్లు మ్యాచ్​ ముగించే బాధ్యతను తీసుకునేవారు. ఇప్పుడు ఇంగ్లండ్​కు​ బట్లర్​.. ఆ పని చేస్తున్నాడు. ఈ విషయంలో ధోనీ అయితే మాస్టర్ లాంటివాడు. అలాంటి వాడు ప్రస్తుతం మా జట్టుకు కావాలి."

-జస్టిన్​ లాంగర్​, ఆస్ట్రేలియా కోచ్

ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్​లో ఆసీస్ జట్టు నిరాశపరిచింది. 0-3 తేడాతో వైట్​వాష్​కు గురైంది. ఈనెల 13 నుంచి న్యూజిలాండ్​తో మూడు వన్డేల సిరీస్​ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఫినిషర్ స్థానాన్ని, జట్టులోని బ్యాట్స్​మెన్ చేజిక్కుంచుకోవాలని లాంగర్ అభిప్రాయపడ్డాడు.

గత సంవత్సర కాలంలో ఆస్ట్రేలియా జట్టులోని 4-7 స్థానాల్లో 13 బ్యాట్స్​మెన్ ఆడారు. ఆరో స్థానంలో 9 మందిని పరీక్షించారు. కానీ వారిలో మ్యాక్స్​వెల్ పర్వాలేదనిపించినా, స్టాయినిస్ తీవ్రంగా నిరాశపరిచాడు. నాలుగు మ్యాచ్​ల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు.

ABOUT THE AUTHOR

...view details