పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాబర్ తనను లైంగికంగా వేధించాడని గతంలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించక పోవడం వల్ల ఇటీవలే లాహోర్‌లోని అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం సదరు క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
బాబర్ అజామ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు - బాబర్ అజామ్‌పై లైంగిక దోపిడీ కేసు
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఇటీవలే ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన తగిన సాక్ష్యాలతో బాధితురాలు కోర్టును ఆశ్రయించగా.. సదరు క్రికెటర్‌పై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
బాబర్ అజామ్‌పై లైంగిక దోపిడీ కేసు
లాహోర్‌కు చెందిన హమీజా ముక్తార్ అనే మహిళ.. బాబర్ ఆజామ్‌పై ఈ ఆరోపణలు చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్.. తనను లైంగికంగా వాడుకున్నాడని ఇటీవలే మీడియాతో వెల్లడించింది. బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని తెలిపింది. దానికి సంబంధించిన కొన్ని వైద్య పత్రాలను కోర్టుకు సమర్పించింది. వాటిని పరిశీలించిన న్యాయస్థానం బాబర్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని నసీరాబాద్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది.
Last Updated : Jan 15, 2021, 11:22 AM IST