తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​లో ఎక్కువ మంది స్వదేశీ కోచ్​లు ఉండాలి' - ఐపీఎల్​ న్యూస్​

ఐపీఎల్​ లాంటి దేశవాళీ టోర్నీలో భారత కోచ్​లను అధికంగా చూడాలనుకుంటున్నట్లు ఆకాంక్షించాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కోచ్​ అనిల్​ కుంబ్లే. ప్రస్తుత సీజన్​లో తానొక్కడే స్వదేశీ కోచ్​నని చెప్పాడు.

Lack of Indian head coaches in IPL isn't true reflection of our resources: Anil Kumble
అనిల్​ కుంబ్లే

By

Published : Sep 9, 2020, 7:33 AM IST

ఐపీఎల్​లో మరింత మంది స్వదేశీ కోచ్​లను చూడాలని అనుకుంటున్నట్లు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ప్రధాన కోచ్​ అనిల్​ కుంబ్లే చెప్పాడు. ప్రస్తుతం సీజన్​లో భారత్​ నుంచి​ కుంబ్లే ఒక్కడే ఉన్నాడు. ఇది మన దేశంలో ఉన్న వనరులను ప్రతిబింబించడం లేదని అన్నాడు.

"ఐపీఎల్​లో మరింత మంది భారత కోచ్​లు ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితి దేశంలో ఉన్న వనరులను ప్రతిబింబించట్లేదు. ఏదో ఓ దశలో స్వదేశం నుంచి ఎక్కువ మంది కోచ్​లు వస్తారు."

- అనిల్​ కుంబ్లే, పంజాబ్ జట్టు​ ప్రధాన కోచ్​

ప్రస్తుత ఐపీఎల్​లో ఏడు ఫ్రాంఛైజీలకు విదేశీయులే కోచ్​లుగా ఉన్నారు. పాంటింగ్​ (దిల్లీ), బ్రెండన్​ మెక్​కలమ్​ (కోల్​కతా), ఫ్లెమింగ్​ (చెన్నై), జయవర్ధనే (ముంబయి), బేలిస్​ (సన్​రైజర్స్​), కాటిచ్​ (బెంగళూరు), మెక్​డొనాల్డ్​ (రాజస్థాన్​) ఈ జాబితాలో ఉన్నారు.

కొన్ని ప్రాక్టీసు మ్యాచ్​లు ఆడితే తమ జట్టు కూర్పుపై తనకు ఓ అవగాహన వస్తుందని కుంబ్లే అన్నాడు. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​ సహా పంజాబ్​ జట్టులో చాలా మంది కర్ణాటక ఆటగాళ్లు ఉన్నారు. కోచ్​ కుంబ్లేదీ కర్ణాటకనే. దీనిపై కుంబ్లే మాట్లాడుతూ.."ఎక్కువ మంది కర్ణాటక వాళ్లు ఉండటం ఉపకరిస్తుంది. ఇతర కుర్రాళ్లతోనూ వాళ్ల భాషల్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. పంజాబీ కుర్రాళ్లతో కాస్త పంజాబీలోనూ మాట్లాడతా. వాళ్లను అలరించడానికి ప్రయత్నిస్తా" అని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details