భారత ఓపెనర్ రోహిత్‌శర్మ గాయంపై తాజాగా స్పందించాడు టీమ్ఇండియా సారథి విరాట్‌కోహ్లీ. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముంగిట మీడియాతో వర్చువల్‌గా మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ ఆసీస్ పర్యటనకు దూరం కావడంపై తన అభిప్రాయం తెలిపాడు విరాట్.
" దుబాయ్‌లో సెలక్షన్ మీటింగ్‌కు రెండ్రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయపడటం వల్ల రోహిత్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండడని అందులో ఉంది. కోలుకునేందుకు అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని దానిలో పేర్కొన్నారు. గాయం వల్ల కలిగే నష్టాలను రోహిత్‌కు చెప్పామని.. వాటిని అతడు అర్థం చేసుకునే సెలక్షన్‌కు అందుబాటులో ఉండట్లేదని ఆ లేఖలో ప్రస్తావించారు. అనంతరం ఐపీఎల్ ఫైనల్లో బరిలోకి దిగిన రోహిత్.. ఆ తర్వాత విమానంలో ఆస్ట్రేలియాకు వస్తాడని అందరం భావించాం. అతడు ఏ కారణాలతో ఆసీస్‌కు రాలేదనేది మాకు సమాచారం లేదు. అయితే ఆ తర్వాత అతడు ఎన్సీఏలో ఉన్నట్లు మాకు అధికారికంగా తెలిసింది. ఫిట్నెస్ ట్రైనింగ్‌లో ఉన్నాడని.. డిసెంబర్ 11న మరోసారి ఫిట్నెస్ పరీక్షిస్తారని అధికారులు స్పష్టం చేశారు.అయితే ఈ అంశాలన్నింటిపై స్పష్టమైన సమాచారం, పూర్తి స్పష్టత లేదు".