తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ ఏడాది తొలి టెస్టు సెంచరీ లబుషేన్​దే - లబుషేన్ సెంచరీ

న్యూజిలాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు లబుషేన్ శతకం బాదాడు. ఫలితంగా ఈ ఏడాదిలో తొలి టెస్టు సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

labuschagn
స్మిత్, లబుషే

By

Published : Jan 3, 2020, 1:02 PM IST

గతేడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ లబుషేన్. హ్యాట్రిక్ సెంచరీలతోనూ ఔరా అనిపించాడు. 2020లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టులో శతకం చేశాడు. ఫలితంగా ఈ ఏడాది తొలి టెస్టు సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

మొత్తంగా లబుషేన్ కెరీర్‌లో 13 టెస్టులు ఆడి.. 4 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. 60కి పైగా సగటుతో 56కు పైగా స్టైక్‌రేట్‌తో ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత ఐదు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించడం చూస్తేనే తెలుస్తోంది అతడు ఎంతటి ఫామ్​లో ఉన్నాడో.

న్యూజిలాండ్‌తో ఆఖరిదైన మూడో టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్ బర్న్స్‌(18) విఫలమయినా.. వార్నర్‌ 45 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం లబుషేన్‌.. స్టీవ్‌ స్మిత్‌తో కలిసి భారీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్మిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన లబుషేన్‌ సెంచరీ చేశాడు.

స్మిత్, లబుషేన్

ఇవీ చూడండి.. 'నీతో ఉంటే.. నన్ను నేను ఇష్టపడతా'

ABOUT THE AUTHOR

...view details