తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో వన్డే సిరీస్​కు ఆసీస్ జట్టు ప్రకటన - Labuschagne picked in Australia ODI squad for India tour

భారత్​లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్​వెల్ దూరం కాగా.. లబుషేన్​కు అవకాశం కల్పించారు సెలక్టర్లు. జనవరి 14 నుంచి టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది కంగారూ జట్టు.

Labuschagne picked in Australia ODI squad for India tour
ఆస్ట్రేలియా

By

Published : Dec 17, 2019, 11:39 AM IST

Updated : Dec 17, 2019, 3:52 PM IST

వచ్చే నెలలో భారత్​లో పర్యటించనున్న ఆస్ట్రేలియా టీమిండియాతో మూడు వన్డేల సిరీస్​ ఆడనుంది. ఇందుకోసం జట్టును నేడు ప్రకటించింది. పాకిస్థాన్​, న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​ల్లో భీకర ఫామ్​తో ఆకట్టుకున్న మార్నస్ లబుషేన్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

లబుషేన్​కు అవకాశం..

12 టెస్టులాడిన లబుషేన్ 58.05 సగటుతో 1,103 పరుగులు చేశాడు. యాషెస్​, పాక్, న్యూజిలాండ్​తో సిరీస్​ల్లో సత్తాచాటి భారత్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆలౌరౌండర్ సీన్ అబాట్ అయిదేళ్ల తర్వతా ఆసీస్​ జట్టులో పునరాగమనం చేయనున్నాడు.

మ్యాక్స్​వెల్​ దూరం..

పేసర్ హెజిల్​వుడ్, స్పిన్నర్ ఆస్టన్ అగర్​కు అవకాశం కల్పించారు సెలక్టర్లు. అయితే గ్లెన్ మ్యాక్స్​వెల్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, నాథన్ లియోన్​కు విశ్రాంతినిచ్చారు. మానసిక ఆరోగ్యం విషయమై మ్యాక్స్​వెల్​ బ్రేక్ తీసుకున్నట్లు సెలక్టర్​ ట్రెవర్ హోమ్స్ తెలిపాడు.

ఆస్ట్రేలియాతో తొలి వన్డే ముంబయి వేదికగా జనవరి 14న ఆడనుంది టీమిండియా. రెండో మ్యాచ్ జనవరి 17న రాజ్​కోట్​లో జరగనుంది. జనవరి 19న జరగనున్న మూడో వన్డేకు బెంగళూరు వేదిక కానుంది.

ఆస్ట్రేలియా జట్టు..

ఆరొన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ కారే, ప్యాట్ కమిన్స్, పీటర్ హ్యాండ్​కోంబ్, జోష్ హెజిల్​వుడ్, మార్నస్ లబుషేన్, కేన్ రిచర్డ్​సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ టర్నర్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా.

ఇదీ చదవండి: డివిలియర్స్ జట్టులోకి వస్తే బాగుండు: డుప్లెసిస్​

Last Updated : Dec 17, 2019, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details