తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ దశాబ్దంలో తొలి డబుల్ సెంచరీ లబుషేన్​దే - labuschagne

న్యూజిలాండ్​తో జరుగుతోన్న మూడోదైన చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఏడాదితో పాటు దశాబ్దంలో తొలి సెంచరీ, ద్విశతకం చేసిన క్రికెటర్​గా ఘనత సాధించాడు.

labuschagne
లబుషేన్

By

Published : Jan 4, 2020, 9:53 AM IST

గతేడాది హ్యాట్రిక్ సెంచరీలతో పాటు టెస్టుల్లో వెయ్యికిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ లబుషేన్. ఇప్పుడు అదే జోరును ఈ ఏడాదిలోనూ కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు. అతడికిది కెరీర్​లో మొదటి డబుల్ సెంచరీ. ఫలితంగా ఈ ఏడాదితో పాటు దశాబ్దంలో తొలి సెంచరీ, ద్విశతకం చేసిన క్రికెటర్​గా ఘనత సాధించాడు.

స్మిత్ టెస్టు సగటును దాటేశాడు

ప్రస్తుతం టెస్టుల్లో రన్​ మెషీన్​గా మారుతున్నాడు లబుషేన్. వరుసగా సెంచరీలతో జోరు చూపిస్తున్నాడు. అలాగే అతడి సహ ఆటగాడు స్మిత్​ టెస్టు సగటను దాటేశాడు. ప్రస్తుతం స్మిత్ యావరేజ్ 62.8 ఉండగా.. లబుషేన్​ 65.4 సగటుతో దూసుకెళ్తున్నాడు.

డబుల్ సెంచరీ సాధించిన అనంతరం 215 పరుగుల వద్ద ఔటయ్యాడు లబుషేన్. మిగతా బ్యాట్స్​మన్​లో స్టీవ్ స్మిత్ మాత్రమే 63 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 454 పరుగులకు ఆలౌటైంది.

ఇవీ చూడండి.. ఫిట్​గా ఉంటారా.. జీతంలో కోత పెట్టమంటారా..!

ABOUT THE AUTHOR

...view details