తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాస్ట్​ పంచ్​ మనదే... - india won the match

న్యూజిలాండ్​తో చివరిదైన ఐదో వన్డేలో భారత్​ ఘన విజయం సాధించింది. అంబటి రాయుడు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ గా నిలిచాడు.

By

Published : Feb 3, 2019, 4:55 PM IST

న్యూజిలాండ్​ పర్యటనలో వన్డే సిరీస్​ను విజయంతో ముగించింది భారత జట్టు. చివరిదైన ఐదో మ్యాచ్​లో విజయం సాధించింది. 4-1తో సిరీస్ కైవసం చేసుకుని ఆతిథ్య జట్టుపై తిరగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమిండియా న్యూజిలాండ్​ ముందు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల ధాటికి కివీస్​ 217 పరుగులకే చేతులెత్తేసింది.

మొదటి నుంచి తడబడిన కివీస్​

253 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన న్యూజిలాండ్​ నాలుగో ఓవర్లోనే ఓపెనర్​ వికెట్​ కోల్పోయింది. 8 పరుగులు చేసిన హెన్రీ నికోల్స్​ షమీ బౌలింగ్​లో జాదవ్​కు క్యాచ్​ ఇచ్చి అవుటయ్యాడు.​ 19 బంతుల్లో 24 పరుగుల చేసి దూకుడు మీదున్న మన్రోను షమీ బౌల్డ్​ చేశాడు. సిరీస్​ మొత్తం ఫామ్​లో ఉన్న రాస్​ టేలర్​ ఒక్క పరుగు మాత్రమే చేసి పాండ్యాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 37 పరగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది కివీస్.

లాథమ్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్న చేశాడు కెప్టెన్ విలియమ్సన్​. ఇద్దరూ నాలుగో వికెట్​కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో కుదురుకుంటోన్న ఈ జోడీని కేదార్​ జాదవ్ విడదీశాడు. 39 పరుగులు చేసిన విలియమ్సన్​ను 26వ ఓవర్లలో ఔట్ చేశాడు. కొద్ది సేపటికే టామ్​ లాథమ్​(37), గ్రాండ్​హోమ్​(11)లను చాహల్​ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్​కు పంపాడు. 31 ఓవర్లలో 135పరుగులకే ఆరు వికెట్లను నష్టపోయింది న్యూజిలాండ్​. ఇక్కడే భారత్ విజయం దాదాపు ఖరారైంది.

తడబడి...నిలబడిన భారత్​

దూకుడుగా ఆడిన నీషమ్​

కివీస్​ మిడిలార్డర్ బ్యాట్స్​మన్ జేమ్స్ నీషమ్​ భారత బౌలర్ల ఆధిపత్యాన్ని కాసేపు నిలువరించాడు. 32 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో 44 పరుగులు చేసి రనౌట్​గా నిష్ర్కమించాడు. కివీస్​ టెయిలండర్లను భారత బౌలర్లు త్వరగానే పెవిలియన్​కు పంపారు. 44.1 ఓవర్లరో 217 పరుగులకు న్యూజిలాండ్​ ఆలౌటైంది.

చాహల్​కు మూడు వికెట్లు దక్కాయి. పాండ్యా, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. జాదవ్,భువనేశ్వర్​ చెరో వికెట్​తీశారు.

నిలబెట్టిన రాయుడు

మొదట బ్యాటింగ్​ చేసిన భారత జట్టు 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాయుడు పరిణతితో బ్యాటింగ్​ చేశాడు. అతనికి విజయ్​ శంకర్​(45) తోడ్పాటునందించాడు. 90 పరుగులు చేసిన రాయుడు శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. చివర్లో హార్ధిక పాండ్యా(22 బంతుల్లో 45) దూకుడుగా ఆడడం వల్ల 49.5 ఓవర్లలో భారత్​ 252 పరుగులు చేసింది. కివీస్​ను కట్టడి చేసి మ్యాచ్​​ గెలిచింది.

ABOUT THE AUTHOR

...view details