టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, నయావాల్ చెతేశ్వర్ పుజారా క్రీజులో నిలిస్తే మైదానంలో పరుగుల వరద పారడం ఖాయం. అలాంటిది అరంగేట్ర టెస్టులోనే వీరిద్దరినీ పెవిలియన్ పంపించి సంచలనం సృష్టించాడు కివీస్ యువపేసర్ జేమిసన్. మిడిలార్డర్‌లో ప్రధానమైన హనుమ విహారినీ ఔట్ చేశాడు. తొలిటెస్టు తొలిరోజు మూడు వికెట్లు తీసి భారత్‌ను 122/5కు పరిమితం చేశాడు. నెల రోజులుగా ఏం జరుగుతుందో నమ్మశక్యం కాకుండా ఉందని జేమిసన్ అంటున్నాడు. కోహ్లీని ఔట్ చేసేందుకు అతడి బలహీనతలు వెతకలేదని తెలిపాడు.
"నిజంగా నమ్మశక్యం కావడం లేదు. రెండు వారాలుగా ఏం జరుగుతుందో అర్థమవ్వడం లేదు. ఈ మ్యాచ్‌లో మేమిప్పుడు మంచి స్థితిలో ఉన్నాం. విరాట్ కోహ్లీ అద్భుత ఆటగాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అతడు కీలకం. విరాట్ త్వరగా ఔటవ్వడం మాకు కీలకం. ఇద్దరు ఆటగాళ్లను తొలి సెషన్‌లోనే పెవిలియన్‌కు పంపించడం నాకు ప్రత్యేకం. కోహ్లీని ఔట్ చేసేందుకు అతడి బలహీనతల గురించి వెతకడం తెలివైన పనికాదు. ఎందుకంటే అతడు అన్ని దేశాల్లోనూ పరుగులు చేస్తున్నాడు. స్టంప్‌కు విసిరితే అతడు బాగా ఆడతాడు. అందుకే పిచ్ సహకారంతో స్టంప్‌లైన్‌కు కొద్దిగా పక్కకు విసిరాను. అదృష్టవశాత్తూ బంతి అతడి బ్యాట్ అంచుకు తగిలి దొరికిపోయాడు."