తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​కు వరుణ్ చక్రవర్తి దూరం - varun chakravarty

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు.

వరుణ్

By

Published : May 1, 2019, 3:21 PM IST

ఐపీఎల్ 12వ సీజన్​ లీగ్ దశలో ఇంకా కొన్ని మ్యాచ్​లు మాత్రమే మిగిలున్నాయి. ప్లేఆఫ్ రేసు కోసం రసవత్తర పోరు జరుగుతోంది. పంజాబ్ కూడా ప్లేఆఫ్ రేసుపై కన్నేసింది. అయితే ఆ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐపీఎల్​కు దూరమయ్యాడు. ఇప్పటికే గాయంతో కొన్ని మ్యాచ్​లకు దూరంగా ఉన్న వరుణ్ పూర్తిగా వైదొలుగుతున్నట్లు జట్టు ప్రకటించింది.

చేతి వేలు గాయం కారణంగా ఈ సీజన్​లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడీ తమిళనాడు స్పిన్నర్. కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 35 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్​లో చేతి వేలికి గాయమై జట్టుకు దూరమయ్యాడు.

లీగ్ దశ చివరి మ్యాచ్​ల వరకు గాయం నుంచి కోలుకుంటాడని జట్టు భావించింది. కానీ అది జరగలేదు. ఈ తమిళనాడు మిస్టరీ స్పిన్నర్​ను పంజాబ్ జట్టు 8.4 కోట్ల ధరకు కొనుగోలు చేయడం విశేషం.

ఇవీ చూడండి.. కోహ్లీ విజయాలకు ఆటంకమిదేనా..?

ABOUT THE AUTHOR

...view details