తెలంగాణ

telangana

ETV Bharat / sports

నా చెవులకు అదే సంగీతం: రాహుల్ - KXIP captain KL Rahul

యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​. నెట్స్​లో బ్యాటింగ్​ చేస్తున్న వీడియోను సోషల్​ మీడియాలో పంచుకున్నాడు.

KXIP captain KL Rahul posts batting practice video ahead of IPL 2020
'ఈ ఐపీఎల్​ సీజన్​ నాకెంతో ప్రత్యేకమైనది'

By

Published : Aug 11, 2020, 5:28 AM IST

ఐపీఎల్​ కోసం నెట్స్​లో బ్యాటింగ్​ ప్రాక్టీసు మొదలుపెట్టాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​. తాను బ్యాటింగ్​ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్​మీడియాలో పంచుకున్నాడు​. 'నా చెవులకిదే సంగీతం' అనే క్యాప్షన్​తో పోస్ట్​ చేశాడీ స్టార్​ బ్యాట్స్​మన్​.

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​గా ఉండటం సహా క్రిస్​ గేల్​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​ వంటి దిగ్గజ ఆటగాళ్లతో ఆడేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవలే వెల్లడించాడు రాహుల్.

"ఐపీఎల్ టోర్నీని ఎంతగానో మిస్​ అవుతున్నా. రాబోయే సీజన్​ నాకెంతో ప్రత్యేకమైంది. దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ఈసారి జట్టుకు నాయకత్వ బాధ్యతలు స్వీకరించబోతున్నా. అలాగే మా జట్టులో ఉత్తమమైన ఆటగాళ్లు ఉన్నారు."

-కేఎల్​ రాహుల్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​

గతేడాది నవంబరులో జరిగిన ఐపీఎల్​ వేలంలో అశ్విన్​ను దిల్లీ జట్టు కొనుగోలు చేయడం వల్ల పంజాబ్​ జట్టుకు తొలిసారి కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించనున్నాడు రాహుల్​. 2018లో రూ.11 కోట్లకు రాహుల్​ను పంజాబ్​ జట్టు సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details