టెస్టు మ్యాచ్లో ఓ ఇన్నింగ్స్లో.. అనిల్ కుంబ్లే పది వికెట్ల రికార్డు సాధించి 22 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా బీసీసీఐ సదరు వీడియోను అధికారిక ట్విట్టర్లో పంచుకుంది. దానిపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. టీమ్ఇండియా 'గొప్ప మ్యాచ్ విన్నర్' అంటూ కుంబ్లేను ప్రశంసించాడు.
"భారత గొప్ప మ్యాచ్ విన్నర్ అనిల్ కుంబ్లే. టీమ్ఇండియా లెజెండ్" అని గంభీర్ స్పందించాడు.