ప్రతిష్ఠాత్మక మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్సీసీ) అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర. ఈ మేరకు అతడి పదవీకాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పెంచాలని నిర్ణయించినట్లు ఎంసీసీ ప్రకటించింది. దీంతో రెండేళ్లు పదవిలో ఉండనున్న నాలుగో వ్యక్తిగా సంగక్కర నిలవనున్నాడు.
అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం పొడిగింపు
ఎమ్సీసీ అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీకాలం, మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సదరు క్లబ్ ప్రకటన చేసింది.
కుమార సంగక్కర
"సాధారణంగా ఎమ్సీసీ అధ్యక్షుడి పదవీకాలం ఏడాదే ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో దానిని పొడిగించొచ్చు. గతంలో ఇలానే లార్డ్ హావ్కే(1914-18), స్టాన్లీ క్రిస్టోపెరెన్స్(1939-45) కొనసాగారు" -ఎమ్సీసీ ప్రకటన
గతేడాది అక్టోబరులో ఎమ్సీసీ అధ్యక్షుడిగా ఎంపికైన సంగక్కర.. ఈ పదవి చేపట్టిన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.