మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ)కు తొలి బ్రిటిషేతర అధ్యక్షుడిగా సంగక్కర ఎంపికయ్యాడు. అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టి... ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. సంగక్కర ఈ అరుదైన అవకాశం అందుకున్నట్లు ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు ఆంథోని రెఫార్డ్ వెల్లడించారు.
'ఎంసీసీ అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవాలని చూస్తోంది. ఈ విషయంపై కుమార ముందుకొచ్చినందుకు సంతోషంగా ఉంది. అతడు మైదానం లోపలా బయట మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అది క్లబ్‌కు పనికొస్తుంది. అధ్యక్షుడి హోదాలోనే ప్రపంచకప్, ఏడాది పాటు సిరీస్‌లకు తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు'
-- ఆంథోనీ రెఫార్డ్, ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు
క్రికెట్ నిబంధనల సంరక్షణ...
1787లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో ఎంసీసీ స్థాపించారు. 1814 వరకు లార్డ్స్ పరిధిలోనే ఉండేది. క్రికెట్ నిబంధనల రూపకల్పనలో కీలక పాత్ర పోషించేది ఈ క్లబ్ అందుకే దీన్ని 'గార్డియన్ ఆఫ్ ద లా ఆఫ్ ద గేమ్' అని పిలుస్తుంటారు.