టీమ్‌ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తొలిసారి కలిసినప్పుడు తనకు చాలా గౌరవమిచ్చాడని మణికట్టు స్పెషలిస్టు కుల్దీప్ యాదవ్ తెలిపాడు. తాజాగా వాళ్లిద్దరూ 'సలాం క్రికెట్' కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలపై ముచ్చటించారు.
"నేను ముంబయి ఇండియన్స్‌కు ఎంపికైనప్పుడు తొలిసారి చాహల్‌ను కలిశా. డీవై పాటిల్ స్టేడియంలో సాధన చేయడానికి వెళ్లినప్పుడు అతడు అక్కడే ఆడుతున్నాడు. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద ఎదురయ్యాం. అప్పుడే నాకెంతో గౌరవమిచ్చాడు. అక్కడి నుంచే మా స్నేహం కొనసాగింది. నన్ను సొంత సోదరుడిలా భావిస్తాడు. ఎంతో బాగా చూసుకుంటాడు. జీవితంతో పాటు క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలపై సూచనలు చేస్తాడు. నాకెప్పుడైనా సమస్యలుంటే దగ్గరకొచ్చి మాట్లాడతాడు. అందువల్లే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది."