తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ - ధోతీ-కుర్తా

ఆ క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ధోతీలు ధరించిన ఆటగాళ్లంతా చెలరేగిపోయారు. ఆ మ్యాచ్​లో రన్నింగ్ కామెంట్రీ​ సంస్కృతంలో వినిపించింది. ఇన్ని ప్రత్యేకతల వెనుక ఓ లక్ష్యం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే...

ధోతీ-కుర్తాలో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ

By

Published : Sep 2, 2019, 11:36 AM IST

Updated : Sep 29, 2019, 3:55 AM IST

ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ

2001లో విడుదలైన ఆమిర్​ఖాన్ లగాన్​ చిత్రం ఇప్పటికీ ఓ సంచలనమే. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా పల్లెటూరు యువకులు ధోతీ కుర్తాలోనే క్రికెట్​ ఆడి, బ్రిటీష్​ వారిని ఓడిస్తారు. అచ్చం అలాంటి వస్త్రధారణలోనే క్రికెట్​ ఆడారు విద్యార్థులు.

బిహార్​ దర్బంగాలోని కామేశ్వర్ సింగ్ దర్బంగా సంస్కృత విశ్వవిద్యాలయం ఈ ప్రత్యేక మ్యాచ్​కు వేదికైంది. విద్యార్థులు ధోతీ-కుర్తా ధరించి మైదానంలోకి దిగి అదరగొట్టేశారు.

ఆటగాళ్లు సునాయాసంగా బంతిని బౌండరీలు దాటించేశారు. రన్నింగ్ కామెంట్రీ కూడా ప్రత్యేకమే. మైక్​ పట్టుకున్న ఓ విద్యార్థి ఆట వివరాలను సంస్కృత భాషలో అనర్గళంగా చెప్పేశాడు. ఈ దృశ్యాలు భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టాయి.

"ధోతీ కట్టుకుని క్రికెట్ ఆడడం,​ సంస్కృతంలో కామెంట్రీ చెప్పడం ప్రారంభించాం. మన వేషధారణను కోల్పోకుండా, మన సంస్కృతిని కాపాడేందుకే ఇలా చేస్తున్నాం. ఉదాహరణకు లగాన్​ చిత్రంలో ఆమిర్​ఖాన్​ ధోతీలోనే క్రికెట్​ ఆడాడు. అలాగే మేము సంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకుసాగుతున్నాం. "
-విద్యార్థి

మన సంప్రదాయ వస్త్రధారణ, సంస్కృత భాషను పరిరక్షించుకుంటూ, ప్రపంచానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే ఇక్కడి విద్యార్థులు

"భారతీయ వేషధారణలో, సంస్కృతంలో కామెంట్రీతో క్రికెట్​ ఆడుతున్నారు. జనాలకు ఇది విచిత్రంగా అనిపిస్తోంది. సంస్కృతం అంటే గ్రాంథికమని, అది అందరూ మాట్లాడలేరని అనుకుంటారు. కానీ... ఇక్కడ ఆ భాషలో అనర్గళంగా కామెంట్రీ చెబుతున్నారు. ఇంతకు మించి ఏం కావాలి?"
-ప్రొ. సర్వనారాయణ్​ ఝా,​ విశ్వవిద్యాలయం వీసీ

ఇదీ చూడండి:వైద్యుడిని కొట్టి చంపిన రోగి బంధువులు!

Last Updated : Sep 29, 2019, 3:55 AM IST

ABOUT THE AUTHOR

...view details