తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేపీఎల్: కృష్ణప్ప.. ఏం దెబ్బ..!

కర్ణాటక ప్రీమియర్ లీగ్​లో కృష్ణప్ప గౌతమ్​ అదరగొట్టాడు. 56 బంతుల్లో 134 పరుగులతో పాటు.. ఎనిమిది వికెట్లు తీసి విజృంభించాడు.

గౌతమ్

By

Published : Aug 24, 2019, 12:36 PM IST

Updated : Sep 28, 2019, 2:31 AM IST

ఆల్​రౌండర్​ అనే పదానికి సరైన అర్థం చెబుతూ కర్ణాటక ప్రీమియర్ లీగ్​లో కృష్ణప్ప గౌతమ్​ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా బల్లారీ టస్కర్స్​.. షిమోగా లయన్స్​పై ఘనవిజయం సాధించింది.

వర్షం కారణంగా మ్యాచ్​ను 17 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బల్లారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 203 పరుగులు చేసింది. రెండో వికెట్​గా వచ్చిన కృష్ణప్ప గౌతమ్​ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 134 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. కేపీఎల్​లో ఓ ఆటగాడికి ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోర్ కావడం విశేషం.

బౌలింగ్​లోనూ విజృంభించాడు గౌతమ్. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులకు 8 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఈ ఆటగాడి దూకుడు ఫలితంగా బల్లారీ జట్టు 70 పరుగుల తేడాతో షిమోగాను మట్టికరిపించింది.

ఒక్క మ్యాచ్​తో గౌతమ్​ రికార్డులు

  • కర్ణాటక ప్రీమియర్ లీగ్​లో అత్యధిక స్కోర్ (134) చేసిన ఆటగాడిగా ఘనత.
  • లీగ్​లో ఒక్క ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్సులు (13) బాది రికార్డు
  • ఫోర్లు, సిక్సులు ద్వారా గౌతమ్​ 106 పరుగులు సాధించాడు. ఇదీ రికార్డే.
  • 39 బంతుల్లో సెంచరీ సాధించి.. అతి తక్కువ బంతుల్లో శతకం చేసిన ఆటగాడిగా ఘనత.

ఇవీ చూడండి.. అశ్విన్​ రికార్డును తిరగరాసిన పేసర్​ బుమ్రా ​

Last Updated : Sep 28, 2019, 2:31 AM IST

ABOUT THE AUTHOR

...view details