తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాహుల్ ద్రవిడ్​ స్థానాన్ని భర్తీ చేసిన ఇద్దరు కోచ్​లు

భారత-ఏ, అండర్​-19 క్రికెట్​ జట్లకు కోచ్​లను మార్చింది బీసీసీఐ. దక్షిణాఫ్రికా-ఏ సిరీస్​ కోసం ద్రవిడ్​ స్థానంలో కోటక్​, మాంబ్రేలను శిక్షకులుగా నియమించింది. అయితే వీరిద్దరి పదవీకాలం రెండు నెలలపాటే ఉండనుంది.

ద్రవిడ్​ స్థానాన్ని భర్తీ చేసిన ఇద్దరు కోచ్​లు

By

Published : Aug 29, 2019, 3:45 PM IST

Updated : Sep 28, 2019, 6:05 PM IST

మాజీ సౌరాష్ట్ర సారథి సీతాన్షు కోటక్​, మాజీ టీమిండియా పేసర్​ పరాస్​ మాంబ్రేలు.. యువ క్రీడాకారులను తీర్చిదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నారు. భారత్​-ఏ, అండర్​-19 జట్లకు వీరిద్దరినీ కోచ్​లుగా నియమించింది భారత క్రికెట్​ కంట్రోల్​ బోర్డు(బీసీసీఐ). 2015 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు ఈ రెండు జట్లకు ప్రధాన కోచ్‌గా పని చేసిన ద్రవిడ్​.. జాతీయ క్రికెట్​ అకాడమీ(ఎన్​సీఏ) అధ్యక్షుడిగాఇటీవలేబాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం ఆ స్థానాలు ఖాళీ అవ్వడం వల్ల ఇద్దరు కోచ్‌లతో వాటిని భర్తీ చేసింది బీసీసీఐ. అయితే ఎన్​సీఏలోనే ఉండే ద్రవిడ్​.. అవసరం బట్టి రెండు జట్ల పర్యవేక్షణ చూసుకోవచ్చు.

మాంబ్రే, కోటక్​

"కోచ్​ నియామకాలపై సాధారణంగా ఎటువంటి ప్రకటనలు ఉండవు. ఎన్​సీఏ ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో భాగంగానే వారిని మార్చాం".
- బీసీసీఐ ప్రతినిధి

భారత్-ఏ, అండర్‌-19 జట్లకు రాహుల్​ ద్రవిడ్​తో కలిసి పని చేశాడు పరాస్‌ మాంబ్రే. 130 ఫస్ట్‌క్లాస్​ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కోటక్​ సొంతం. అయితే వీరిద్దరూ కేవలం రెండు నెలలు మాత్రమే కోచ్‌లుగా కొనసాగనున్నారని బీసీసీఐ తెలిపింది.

మళ్లీ పవార్​కే పగ్గాలు

ప్రస్తుతం భారత్ ఏ జట్టుకు బౌలింగ్​ కోచ్​గా ఉన్న మాంబ్రే స్థానంలో స్పిన్నర్​ రమేశ్​ పొవార్​ బాధ్యతలు స్వీకరించనున్నాడు. మహిళల టీ20 ప్రపంచ కప్​ సమయంలో మిథాలీరాజ్​తో గొడవ కారణంగా మహిళా జట్టు కోచ్​ పదవి నుంచి పొవార్​ను తప్పించారు​.

ఇదీ చూడండి...వైరల్: పీటీ ఉష టెన్నిస్‌ అడుతుందటా!

Last Updated : Sep 28, 2019, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details