క్రికెట్లో బౌలర్లు బంతిపై ఉమ్ము, చెమట రాయడం కరోనా వైరస్ వ్యాప్తికి దారి తీయవచ్చన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో మైనపు పూతను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంతి మెరుపు కోసం ఆస్ట్రేలియా కంపెనీ కూకాబుర్రా త్వరలోనే బంతిపై మెరుపు కోసం మైనపు పదార్థాన్ని తయారు చేయనుంది.
బంతి మెరుపు కోసం మైనం పూత! - బంతిపై ఉమ్ము, చెమట రాయడం నిషేధం
బంతిపై మెరుపు కోసం ఉమ్ము, చెమట పూయకుండా వాటికి ప్రత్యామ్నాయంగా మైనపు పదార్థం తయారు చేయనుంది ఆస్ట్రేలియా కంపెనీ కూకాబుర్రా. ఇటీవల బంతిపై ఉమ్ము, చెమట ఉపయోగించకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.
బంతి మెరుపు కోసం మైనం పూత!
"జేబులో ఇమిడేలా ఉండే ఈ మైనపు పదార్థం సాయంతో అంపైర్ సమక్షంలోనే బంతిపై రుద్దొచ్చు. ఒక నెలలో ఇది అందుబాటులోకి రావచ్చు. ఇది ఎలా పని చేస్తుందో మ్యాచ్ పరిస్థితుల్లో దీన్ని పరీక్షించాల్సిన అవసరం ఉంది" అని కూకాబుర్రా తెలిపింది. ఆస్ట్రేలియా క్రీడా సంస్థ మార్గదర్శకాల మేరకు బంతిపై ఉమ్ము, చెమట ఉపయోగించకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవల నిర్ణయించుకుంది.