ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరీబియన్ వీరుడు రసెల్ విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. చివర్లో వచ్చి 49 పరుగులు చేసిన రసెల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. వార్నర్ మెరుపులు హైదరాబాద్ జట్టుకు గెలుపును అందించలేకపోయాయి.
నిరాశలో సన్‌రైజర్స్ జట్టు - టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో నిషేధానికి గురైన వార్నర్..తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 53 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌లో బెయిర్‌స్టో 39 పరుగులు, విజయశంకర్ 40 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.
కోల్‌కతా బౌలర్లలో రసెల్ రెండు వికెట్లు, పీయూష్ చావ్లా ఓ వికెట్ దక్కించుకున్నారు. మిగతా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చారు.
- అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా ఆరంభంలోనే క్రిస్‌లిన్ వికెట్ కోల్పోయింది. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు నితీశ్ రానా, ఉతప్ప. నితీశ్ రానా 68 పరుగులు చేసి రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇతర బ్యాట్స్మెన్లలో ఉతప్ప 35, దినేశ్ కార్తీక్ 2 , శుభ్‌మన్ గిల్ 18 పరుగులు చేశారు.
రసెల్ విధ్వంసం..
- 16 ఓవర్ వరకు 123 పరుగులే చేసింది కోల్‌కతా జట్టు. అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు రసెల్. సిద్దార్ధ్, భువనేశ్వర్ ఓవర్లలో వరస పెట్టి సిక్సర్లు బాదుతూ లక్ష్యాన్ని చిన్నది చేశాడు.
- ఆఖరి ఓవర్‌కి 13పరుగులు అవసరమయ్యాయి. రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులుండగానే పనిపూర్తి చేశాడు శుభమన్ గిల్. చివరి నాలుగు ఓవర్లలో59 పరుగులు చేసింది కోల్‌కతా జట్టు.
- 15 ఓవర్ల వరకు పొదుపుగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. సిద్దార్ధ్, షకిబ్, రషీద్, సందీప్ తలో వికెట్ తీశారు.