ఇప్పటికే ఆడిన చెరో ఐదింటిలో గెలిచిన కోల్‌కతా, పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ గెలుపు చాలా అవసరం. మొదటగా టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
వరుసగా ఆరు మ్యాచ్‌ల ఓటమి అనంతరం ముంబయిపై గెలుపుతో కాస్త ఊరట లభించింది కోల్‌కతా జట్టుకు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటోంది. హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన పంజాబ్ నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తాము కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నామని చెప్పాలనుకుంటోంది.
పిచ్ పేస్, బౌన్స్‌కు సహకరించే అవకాశం ఉంది. పిచ్‌పై తేమ సీమర్లకు అనుకూలిస్తుంది.