తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెంగళూరు బ్యాటింగ్​.. కోల్​కతాతో మ్యాచ్​​

కోల్​కతా వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్​లో.. టాస్ గెలిచిన కోల్​కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస ఓటములతో ఉన్న ఇరుజట్లు గెలుపుపై కన్నేశాయి.

By

Published : Apr 19, 2019, 7:50 PM IST

ఐపీఎల్

ఆడిన 8 మ్యాచ్​ల్లో ఏడింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది రాయల్ ఛాలెంజర్స్ జట్టు. హ్యాట్రిక్ ఓటములతో ఢీలాపడింది కోల్ కతా. ఇరుజట్లు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది.

ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే బెంగళూరు తప్పనిసరిగా మిగిలిన అన్ని మ్యాచ్​ల్లో గెలవాల్సిన పరిస్థితి. రేసులో నిలవాలంటే కోల్​కతాకు ఈ విజయం చాలా అవసరం. ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్​లో రసెల్ విధ్వంసంతో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్. ఈసారైనా ప్రతీకారం తీర్చుకోవాలని జట్టు భావిస్తోంది.

బెంగళూరు కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. ఏబీ డివిలియర్స్ అస్వస్థత కారణంగా దూరం కాగా స్టెయిన్ జట్టులోకి వచ్చాడు. హెన్రిచ్ క్లాసన్ తుదిజట్టులో చోటు సంపాదించాడు.

జట్లు
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, మొయిన్​ అలీ, స్టాయినిస్, హెన్రిచ్ క్లాసన్, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, డేల్ స్టెయిన్, సిరాజ్, నవదీప్ సైనీ, చాహల్

కోల్ కతా నైట్ రైడర్స్
సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ (కెప్టెన్), పియూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, క్రిస్ లిన్, ఆండ్రీ రసెల్, కుల్దీప్ యాదవ్, నితీష్ రాణా, ప్రసిద్ధ్​ కృష్ణ, శుభమన్ గిల్, హారీ గుర్నే

ABOUT THE AUTHOR

...view details