వచ్చే ఐపీఎల్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన టామ్ బాంటన్.. బిగ్‌బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టించాడు. బ్రిస్బేన్ హీట్ తరఫున దంచికొట్టాడు. సిడ్నీ థండర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. 16 బంతుల్లో అర్ధసెంచరీ చేసి, ఐపీఎల్ బౌలర్లకు ముందస్తు హెచ్చరికలు పంపాడు. ఈ మ్యాచ్‌లో ఇతడు వరుసగా 5 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఫలితంగా బ్రిస్బేన్ జట్టు.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 16 పరుగుల తేడాతో గెలిచింది.
వర్షం వల్ల తొలుత ఈ మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్రిస్బేన్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు లిన్-బాంటన్ విశ్వరూపం చూపించడం వల్ల నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. బాంటన్-19 బంతుల్లో 56 పరుగులు.. లిన్-13 బంతుల్లో 31 పరుగులు చేశారు. ఛేదనలో థండర్స్.. 5 ఓవర్లలో 60-4తో నిలిచింది. వర్షం అడ్డంకిగా మారడం వల్ల బ్రిస్బేన్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది.