ఈ ఐపీఎల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. వచ్చే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించింది. కివీస్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కలిస్ ఇప్పటివరకు కోచ్‌గా పనిచేశాడు.
కోల్‌కతా నైటరైడర్స్కు కెప్టెన్‌గానూ ఇంతకుముందు పనిచేశాడు మెక్కల్లమ్. ఐపీఎల్ ప్రారంభ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే కేకేఆర్ తరఫున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 158 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటుంది.
2019లో కలిస్ అధ్వర్యంలో బరిలోకి దిగిన కేకేఆర్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌కు దినేశ్ కార్తిక్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.