టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 159 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ బౌండరీలే లక్ష్యంగా దాడిచేశారు. వీరి ధాటికి 2.4 ఓవర్లలోనే 42 పరుగులు సాధించింది రైడర్స్. నరైన్ 8 బంతుల్లో 2 సిక్సులు, 3 ఫోర్లతో 25 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
మెరిసిన సన్ రైజర్స్ బౌలర్లు.. కోల్‌కతా 159/8 - sunrisers hyderabad
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. క్రిస్ లిన్ అర్ధశతకంతో మెరిశాడు.
వరుస వికెట్లు పడుతున్నా రన్‌రేట్ మాత్రం తగ్గకుండా ఆడారు కోల్‌కతా బ్యాట్స్‌మెన్. క్రిస్ లిన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ (30) కూడా ఫర్వాలేదనిపించాడు. శుభమన్ గిల్ (3), నితీష్ రానా (11), దినేష్ కార్తీక్ (6) విఫలమయ్యారు. రసెల్ (15) రెండు సిక్సులతో భయపెట్టినా భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అలరించారు. మొదట రన్ రేట్ పెరిగినా.. చివర్లో అద్భుత ప్రదర్శనతో తక్కువ పరుగులకే కోల్‌కతాను కట్టడి చేశారు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో మెరవగా, భువనేశ్వర్ కుమార్ రెండు, సందీప్ శర్మ, రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.