ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు సారథి కోహ్లీ దూరమవ్వడం టీమ్ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు ఆసీస్ మాజీ సారథి ఇయాన్ చాపెల్. అయితే విరాట్ నిష్క్రమణతో మరో యువ ఆటగాడికి తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం లభిస్తుందని చెప్పాడు. కానీ అతడి స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై భారత సెలక్టర్లకు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నాడు.
'కోహ్లీ గైర్హాజరీ టీమ్ఇండియాకు తీరని లోటు' - kohli absence teamindia affect
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు.. సారథి కోహ్లీ గైర్హాజరు భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై గట్టి ప్రభావం చూపుతుందని చెప్పాడు ఆసీస్ మాజీ సారథి ఇయాన్ చాపెల్. మరోవైపు ఓపెనర్లుగా ఎవరిని దింపాలనే విషయమై భారత సెలక్టర్లతో పాటు ఆసీస్ కూడా సందిగ్ధంలో ఉందని అన్నాడు.
కోహ్లీ
మరోవైపు, ఆస్ట్రేలియా కూడా ఓపెనర్ల విషయంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటోందని అన్నాడు చాపెల్. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేసేదెవరో స్పష్టత లేదన్నాడు. అయితే వార్నర్‌కు జోడీగా.. యువ ఆటగాడు విల్ పుకోవిస్కీ ఇప్పటికే అర్హత సాధించాడని చెప్పాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియాతో సిరీస్.. సోషల్ మీడియాకు ఆటగాడు దూరం