ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన విదేశీ క్రికెటర్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమం అని భారత మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ చెప్పాడు. ఆటలో అతడు గాంధేయ వాదాన్ని అనుసరించట్లేదని అన్నాడు.
"గతంలో ప్రత్యర్థి జట్లతో ఆడేటప్పుడు చాలామంది టీమ్ఇండియా క్రికెటర్లు నెమ్మదిగా వ్యవహరించేవారు. ఆ విధానాన్ని మార్చిన తొలి ఆటగాడు సౌరభ్ గంగూలీ. కోహ్లీ కూడా తన పరధిలో ఉండాలనుకోవట్లేదు. ఎప్పుడూ దూకుడు స్వభావంతో ఉండేవాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలనేది అతడి ఆలోచన. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన విదేశీ క్రికెటర్లలో కోహ్లీనే ది బెస్ట్" -గ్రెగ్ ఛాపెల్, ఆసీస్ మాజీ క్రికెటర్
ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమ్ఇండియా. తొలి మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లిపోనున్నాడు. ఈ విషయం గురించి ఛాపెల్ మాట్లాడాడు.