తెలంగాణ

telangana

ETV Bharat / sports

డీడీసీఏ​ కోచ్​గా కోహ్లీ చిన్ననాటి శిక్షకుడు - virat kohli latest updates

దిల్లీ జిల్లా‌ క్రికెట్‌ అసోసియేషన్(డీడీసీఏ) నూతన చీఫ్​ కోచ్​గా రాజ్​కుమార్​ ఎంపికయ్యారు. ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి బాల్యంలో క్రికెట్​లో శిక్షణ ఇచ్చారు రాజ్​ కుమాార్​. ఆయనతో పాటుగా డీడీసీఏలో మరికొంత మంది వివిధ హోదాల్లో నియమితులయ్యారు.

Kohli's childhood coach Rajkumar Sharma appointed Delhi chief coach
డీడీసీఏ ఛీఫ్​ కోచ్​గా.. కోహ్లీ చిన్ననాటి శిక్షకుడు

By

Published : Dec 20, 2020, 5:11 PM IST

దిల్లీ జిల్లా‌ క్రికెట్‌ అసోసియేషన్​(డీడీసీఏ)లో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ చిన్ననాటి కోచ్​ రాజ్​కుమార్​ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. డీడీసీఏ చీఫ్​ కోచ్​గా ఆయన నియమితులయ్యారు. సీనియర్​ విభాగంలో 2020-21 సీజన్​కు శిక్షకుడిగా రాజ్​ కుమార్​ వ్యవహరించనున్నారు. డీడీసీఏకు అసిస్టెంట్​ కోచ్​గా గురుశరణ్​ సింగ్​ ఎంపికయ్యారు. ఈ మేరకు డీడీసీఏ ఆదివారం ప్రకటన విడుదల చేసింది.

కోహ్లీకి బాల్యంలో క్రికెట్​ నేర్పిన కోచ్​గా రాజ్​కుమార్​ సుపరిచితం. రైట్​ హ్యాండ్​ బ్యాట్స్​మన్​ అయిన రాజ్​కుమార్​.. దిల్లీ తరఫున తొమ్మిది ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లు ఆడాడు. కోహ్లీ వంటి అద్భుత ఆటగాడిని తీర్చిదిద్దినందుకు గానూ 2016లో ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు.

డీడీసీఏలో కొత్తగా..

డీడీసీఏ సెలెక్షన్​ కమిటీ ఛైర్​పర్సన్​గా అశు డానీ నియమితులయ్యారు. మోహన్​ చతుర్వేదీ, చైతన్యా నందా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. డీడీసీఏ ట్రైనర్​గా ఉమేశ్​ చికారా, కొత్త ఫిజియోగా గజేంద్ర కుమార్ ఎంపికయ్యారు. క్రికెట్​ సలహా కమిటీ(సీఏసీ) పర్యవేక్షణలో ఈ నూతన సభ్యుల నియామకం చేపట్టినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రోహన్​ జైట్లీ ఆదివారం తెలిపారు.

ఇదీ చూడండి:'టీమ్ఇండియా ఈ మార్పులు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details