మే 12వ తేదీన ఐపీఎల్ ఫైనల్... అదే రోజు ఓటు హక్కు వినియోగించుకోనున్నాడు విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించాడు. గురుగ్రామ్‌లో మే12న ఓటు వేయనున్నట్లు తెలిపాడు... మీరూ ఓటు వేస్తున్నారా అంటూ ప్రజలను అడిగాడు.
ఐపీఎల్ ఫైనల్రోజు ఓటు వేయనున్న కోహ్లీ - విరాట్ ఓటర్ ఐడీ
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నాడు విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలియజేస్తూ ఓటర్ గుర్తింపు కార్డును ఇన్‌స్టాలో పంచుకున్నాడు.

ఐపీఎల్ ఫైనల్రోజు ఓటు వేయనున్న కోహ్లీ
దరఖాస్తు తిరస్కరణ:
ప్రస్తుతం కోహ్లీ, అనుష్క కలిసి ముంబయిలో ఉంటున్నారు. అక్కడే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. కోహ్లీ ముంబయికి ఓటరు కార్డు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా...అధికారులు గడువుతేదీ ముగిసిందని తిరస్కరించారు. ఫలితంగా కోహ్లీ హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓటు వేయనున్నాడు. అనుష్క శర్మ మాత్రం ముంబయిలోని వోర్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోనుంది.