ఐసీసీ శనివారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని 6వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ(862), పుజారా(760) కాకుండా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె (748, 8వ స్థానం) భారత్ నుంచి టాప్ 10లో ఉన్నాడు.
బ్యాట్స్మెన్లలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్(919) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ద్వయం స్టీవ్ స్మిత్(891), మార్నస్ లబుషేన్(878) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(823) 5వ ర్యాంకులో ఉన్నాడు. మరోవైపు భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్, ఓపెనర్ రోహిత్ శర్మ వరసగా 13, 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.