తెలంగాణ

telangana

ETV Bharat / sports

పింక్ టెస్టు మాకు సవాలే: విరాట్ కోహ్లీ

పింక్ టెస్టు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కోల్​కతాలో మీడియాతో మాట్లాడిన విరాట్.. మ్యాచ్​ కోసం సిద్ధంగా ఉన్నామని అన్నాడు.

విరాట్ కోహ్లీ

By

Published : Nov 21, 2019, 11:52 AM IST

Updated : Nov 21, 2019, 12:04 PM IST

గులాబి బంతితో పోరుకు ఒక్కరోజు మాత్రమే ఉంది. డేనైట్ విధానంలో తొలిసారి తలపడుతున్న టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. శుక్రవారం బంగ్లాతో జరగనున్న ఈ మ్యాచ్​ గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో ముచ్చటించాడు.

"రేపు చారిత్రక మ్యాచ్ ఆడనున్నాం. గులాబి బంతి టెస్టు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్ మాకు సవాల్​తో కూడుకున్నది. ఈడెన్​గార్డెన్ వేదికగా​ జరగనున్న ఈ టెస్టు చిరకాలం గుర్తుండిపోతుంది" - విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.

పింక్ బంతితో తను ఇప్పటివరకు ఆడలేదని అన్నాడు కోహ్లీ.

"గులాబి బంతితో ఆడిన అనుభవం నాతో పాటు చాలామందికి లేదు. టెక్నిక్​లు ఎక్కువ ఉపయోగించి ఏకాగ్రతతో ఆడాలి. ఇది మాకు సవాలే. గులాబి రంగును గుర్తించి ఆడడం కొంచె కష్టం " - విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.

టెస్టు క్యాలెండర్​పై ద్రవిడ్ చెప్పిన విషయాన్ని విరాట్​ కూడా పునరుద్ఘాటించాడు.

"నా అభిప్రాయం ప్రకారం డే నైట్ మ్యాచ్.. టెస్టు ఫార్మాట్​ను మారుస్తుందని అనుకోవడం లేదు. ద్రవిడ్ చెప్పిన ప్రకారం మాకు టెస్టు క్యాలెండర్ కావాల్సిందే" -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.

గులాబి బంతి బౌలర్లకు బాగా అనుకూలిస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

"గులాబి బంతితో బౌలర్లు బాగా స్వింగ్ చేయగలరు. అది మాకు కలిసొచ్చే అంశం. డేనైట్ టెస్టులో వారు సత్తాచాటుతారు" -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి.

ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ప్రస్తుతం శుక్రవారం ప్రారంభం కానున్న డే అండ్ నైట్ టెస్టుపైనే అందరి కళ్లు ఉన్నాయి. గులాబి బంతితో ఆడడం ఇరుజట్లకు ఇదే మొదటి సారి.

ఇదీ చదవండి: కొరియా మాస్టర్స్​ నుంచి కిదాంబి శ్రీకాంత్ ఔట్​

Last Updated : Nov 21, 2019, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details