తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్ కోహ్లీ మ్యాజిక్.. ఒక్క రోజే రెండు రికార్డులు - kohli ind vs aus

ఆసీస్​తో జరుగుతున్న డే/నైట్​ టెస్టులో కోహ్లీ రెండు సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. కెప్టెన్​గా, ఆటగాడిగా ఆసీస్​పై అధిపత్యం చెలాయిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్​లో 74 పరుగుల వద్ద రనౌట్​గా విరాట్ వెనుదిరిగాడు.

Kohli scores most runs against Australia as India captain, and surpasses sachin tendulkar
కెప్టెన్ కోహ్లీ మ్యాజిక్.. ఒక్క రోజే రెండు రికార్డులు

By

Published : Dec 17, 2020, 4:57 PM IST

Updated : Dec 17, 2020, 11:01 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మొదటి రోజు అదరగొట్టాడు. అర్ధసెంచరీతో(74 పరుగులు) పాటు సరికొత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే 51 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు.

కెప్టెన్ కోహ్లీ

ఆస్ట్రేలియాలో ఎక్కువ పరుగులు చేసిన భారత కెప్టెన్​గా కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 1964-1969 మధ్య అప్పటి కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. 20 ఇన్నింగ్స్​ల్లో 829 పరుగులు చేశారు. ప్రస్తుత సారథి కోహ్లీ 17 ఇన్నింగ్స్​ల్లోనే ఆ మార్క్​ను దాటేశాడు.

ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్​గా కోహ్లీ నిలిచాడు. ఇంతకు ముందు సచిన్ 2549 పరుగులతో ఉండగా, దానిని విరాట్.. ప్రస్తుత మ్యాచ్​తో అధిగమించాడు. అయితే సచిన్​కు 63 ఇన్నింగ్స్​లు పట్టగా, కోహ్లీ కేవలం 53 ఇన్నింగ్స్​ల్లో ఆ మార్క్​ను అందుకోవడం విశేషం.

Last Updated : Dec 17, 2020, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details