తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎవరైనా అడిగితే నా గుర్తింపు ఇచ్చేస్తా'

ఓ గొప్ప క్రికెటర్​గా తనకున్న పేరు ప్రతిష్ఠలను ఎవరైనా ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తానని అన్నాడు టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. భారత జట్టులో తన స్థాయికి లభించే గుర్తింపును అంతగా ఇష్టపడనని కోహ్లీ తెలిపాడు.

kohli
కోహ్లీ

By

Published : May 31, 2020, 6:06 PM IST

ఆటలోనే కాదు ఆదాయంలోనూ తనకు ఎదురులేదని నిరూపించిన టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ.. తన పేరు ప్రతిష్ఠలు ఎవరైనా ఇవ్వమని అడిగితే అలాగే ఇచ్చేస్తానని చెప్పాడు. తాజాగా వెటరన్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​తో కలిసి ఇన్​స్టా లైవ్​లో పాల్గొన్న ఇతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. భారత జట్టులో తన స్థాయికి లభించే గుర్తింపును అంతగా ఇష్టపడనని కోహ్లీ తెలిపాడు.

"నిజం చెప్పాలంటే నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా బాగా ఆడతావని తెలుసు. ఇతరులను ప్రేరేపించే ఏ అవకాశం వచ్చినా నేను ఇష్టపడతా. అలాగే ఏ ఆటగాడికైనా దేశం తరఫున ఆడటమే అతిపెద్ద గర్వకారణం. నేను కూడా అందుకు సంతోషిస్తున్నా. ఇక ఎవరైనా నా వద్దకు వచ్చి నీ పేరు ప్రతిష్ఠలు ఇవ్వడానికి ఇష్టమేనా అని అడిగితే.. మరోమాట మాట్లాడకుండా ఇచ్చేస్తా. నాకు సాధారణ జీవితం గడపడమంటే చాలా ఇష్టం. ఒక స్థాయికి చేరాక ఏది ముఖ్యమైన పనో అదే చేస్తున్నామని గ్రహిస్తాం. చివరికి సాధారణ జీవితమే గడపాల్సి ఉంటుంది.

గతంలో ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లడానికి స్వేచ్ఛ ఉండేది. ప్రతి నిమిషం నువ్వేం చేస్తున్నావో అని అంటిపెట్టుకొని ఉండడానికి.. అప్పుడు ఎవరి చేతుల్లోనూ కెమెరా ఫోన్లు ఉండేవి కావు. నేను, అనుష్క కూడా.. మా ఇంట్లో సాధారణ పనులు చేసుకోడానికి ఇష్టపడతాం. దాన్ని ఆస్వాదిస్తాం. ఇక పేరు ప్రతిష్ఠలు, గుర్తింపు, మేం ఏం చేస్తున్నామనే లాంటి విషయాలను నేను పట్టించుకోను. ఇలాంటి విషయాలు మన జీవితాలను ముందుకు సాగనీయవని నాకనిపిస్తుంది. మేమెప్పుడూ(అనుష్క, కోహ్లీ) సామాజిక మాధ్యమాలతో కలిసి పెరగలేదు. ఒకవేళ మేం వీటిని వాడొద్దని నిర్ణయించుకుంటే చాలా ఈజీగా వాటి నుంచి వైదొలుగుతాం. ఇప్పటి తరానికి ఇది చాలా కష్టంగా ఉండొచ్చు. నేనైతే.. ఇవన్నీ నా నుంచి తీసుకెళ్లండని చెప్పేస్తా"

-కోహ్లీ, టీమ్​ఇండియా సారథి.

తాజాగా అత్యధికంగా ఆర్జిస్తోన్న వందమంది క్రీడాకారుల్లో కోహ్లీ ఒక్కడే ఫోర్బ్స్​ జాబితాలో చోటు దక్కించుకుని 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఏకంగా 34 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.

ఇదీ చూడండి : సచిన్​.. ఈ రికార్డును బ్రేక్ చేయ్: యువరాజ్

ABOUT THE AUTHOR

...view details