తెలంగాణ

telangana

ETV Bharat / sports

శంషాబాద్ ఘటన సిగ్గుచేటు: విరాట్​ - శంషాబాద్ ఘటనపై విరాట్ స్పందన

శంషాబాద్ పశువైద్యురాలిపై జరిగిన అఘాయిత్యం నిజంగా సిగ్గుచేటని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. సమాజమంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చాడు.

kohli react on veterinary doctor rapr case
శంషాబాద్ ఘటన నిజంగా సిగ్గుచేటు: విరాట్​

By

Published : Nov 30, 2019, 11:02 PM IST

Updated : Nov 30, 2019, 11:52 PM IST

శంషాబాద్ పశు వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆడపిల్లలపై అమానవీయంగా జరుగుతున్న అకృత్యాలకు కఠిన చర్యలు చేపట్టేలా సమాజమంతా ఏకమై.. ఇలాంటి ఘటనలను అంతమొందించాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

"హైదరాబాద్​లో ​ జరిగిన ఘటన నిజంగా సిగ్గు చేటు. ఆడపిల్లలపై అమానవీయంగా జరుగుతున్న అకృత్యాలపై సమాజమంతా ఏకమై అంతమొందించేందుకు ఇదే సరైన సమయం" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు.

ఇదీ చదవండి: నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు: చిరంజీవి

Last Updated : Nov 30, 2019, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details