తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాలీ బీచ్​లో ఉల్లాసంగా కోహ్లీ సేన - టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ సహా మిగతా క్రికెటర్లు ఆంటిగ్వాలోని జాలీ బీచ్​లో సందడి చేశారు. ఆగస్టు 3 నుంచి విండీస్‌ పర్యటనలో ఉన్న కోహ్లీ సేన... విరామం లేకుండా మ్యాచ్​లు ఆడుతోంది. అయితే తాజాగా కాస్త సమయం దొరకగానే సముద్రంలో ఈత కొడుతూ ఉల్లాసంగా గడిపారు ఆటగాళ్లు. అప్పుడు తీసిన ఓ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

జాలీ బీచ్​లో కోహ్లీ సేన సందడి

By

Published : Aug 21, 2019, 6:36 PM IST

Updated : Sep 27, 2019, 7:28 PM IST

విండీస్​ టూర్​లో భాగంగా వరుస మ్యాచ్​లతో బిజీబిజీగా ఉన్న కోహ్లీ సేనకు కాస్త విరామం దొరికింది. ఇంకేముంది ఆటగాళ్లందరూ కలిసి ఆంటిగ్వాలోని జాలీ బీచ్‌లో సరదాగా గడిపారు. అక్కడ తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు విరాట్​ కోహ్లీ. "బీచ్‌లో ఆటగాళ్లతో ఇదొక అద్భుతమైన రోజు" అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌, సహాయ సిబ్బంది బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.

ఇటీవల విండీస్​తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి ఆంటిగ్వాలో విండీస్‌తో తొలి టెస్టును ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ఇరుజట్లకు టెస్టు ఛాంపియన్‌షిప్‌ మొదలవ్వడం వల్ల ఈ మ్యాచ్​ కీలకంగా భావిస్తున్నారు.

Last Updated : Sep 27, 2019, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details