తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ట్వీట్ నాకు పాఠం నేర్పింది: విరాట్ - kohli

ధోనీపై చేసిన ట్వీట్​ గురించి విరాట్ కోహ్లీ స్పందించాడు. మహీ ఇన్నింగ్స్ గుర్తు చేస్తూ.. ఆ ఫొటో సాధారణంగా పెట్టానని ఇంత సంచలనం అవుతుందని అనుకోలేదని తెలిపాడు. ఈ ట్వీట్ తనకు గుణపాఠం నేర్పిందని చెప్పాడు.

విరాట్ కోహ్లీ

By

Published : Sep 14, 2019, 4:56 PM IST

Updated : Sep 30, 2019, 2:30 PM IST

2016 టీ20 ప్రపంచకప్​లో మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఆడిన ఇన్నింగ్స్ గుర్తుచేస్తూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. దీనిని చూసిన కొందరు మహీ రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వార్తలు సృష్టించారు. తాజాగా ఈ అంశంపై విరాట్ స్పందించాడు. ఆ ట్వీట్ తనకు సరైన గుణపాఠం నేర్పిందని అన్నాడు.

"అసలు నేను ఆ విషయం(ధోనీ రిటైర్మెంట్​) గురించి ఏమీ ఆలోచించలేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఫొటో కనిపించింది.. అదొక జ్ఞాపకంలా అనిపించి పోస్ట్ చేశాను. కానీ అది వార్తా కథనం అవుతుందని ఊహించలేదు. ఈ అంశం నాకు గుణపాఠం నేర్పించింది. ప్రజలు వేరే విధంగా ఊహించుకుంటారని అనుకోలేదు. -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

2016 టీ20 ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో భారత్ 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ దశలో విరాట్​తో కలిసి ధోనీ మరో వికెట్ పడకుండా ఆడి భారత్​కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్​లో వీరిద్దరూ వేగంగా సింగిల్స్, డబుల్స్​ తీస్తూ పరుగులు సాధించారు. ఈ సందర్భాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు కోహ్లీ.

"ఆ గేమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆరోజు ప్రత్యేకమైంది. పరుగుల విషయంలో ఈ మనిషి ఒక పరీక్ష పెట్టాడు. అది ఫిట్‌నెస్‌ టెస్టులా అనిపించింది" -కోహ్లీ, టీమిండియా సారథి

కోహ్లీ చేసిన ట్వీట్ ధోనీ రిటైర్మెంట్​కు సంకేతంగా భావిస్తూ ఈ అంశంపై వరుస కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని తర్వాత తేలింది.

Last Updated : Sep 30, 2019, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details