టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది టెస్టు ర్యాంకింగ్స్నుఅగ్రస్థానంతో ముగించాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్లో కోహ్లీ(928 పాయింట్లు) మొదటి స్థానంలో, ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్(911 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కేన్ విలియమ్సన్ (822), లబుషేన్.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. భారత బ్యాట్స్మన్ పుజారా మాత్రం నాలుగు నుంచి ఐదుకు పడిపోయాడు. అజింక్య రహానే ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంతో ఏడాదిని ముగించిన కోహ్లీ - కమిన్స్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు, స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. బౌలర్లలో కమిన్స్ మొదటి స్థానంతో ఏడాదికి ముగింపు పలికాడు.
కోహ్లీ
బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్పీడ్ స్టార్ బుమ్రా (794) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (772) మహ్మద్ షమి (771) వరుసగా తొమ్మిది, పది ర్యాంకుల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ (902 పాయింట్లు) అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు. నీల్ వాగ్నర్ (859), కగిసో రబాడ (832) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇవీ చూడండి.. భారత్తో సిరీస్కు ఆస్ట్రేలియా జట్టులో మార్పులు