తెలంగాణ

telangana

ETV Bharat / sports

జర్నలిస్టుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం - World Test Championship

న్యూజిలాండ్​తో టెస్టు తర్వాత జరిగిన సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ సిరీస్​ను 0-2 తేడాతో కోల్పోయింది భారత్.

virat kohli
విరాట్ కోహ్లీ

By

Published : Mar 2, 2020, 12:07 PM IST

Updated : Mar 3, 2020, 3:34 AM IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. మరోసారి జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కివీస్​పై టెస్టు సిరీస్​​ ఓటమి(0-2 తేడాతో) అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగింది?

ఆదివారం జరిగిన కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ ఔటైన సందర్భంలో కోహ్లీ, వీక్షకులను చూస్తూ నోటి వద్ద వేలు పైకెత్తి ఏదో అన్నట్లు కనిపించాడు. ఈ వీడియో వైరల్‌గా మారడం వల్ల అతడి ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఇదే విషయంపై ఆ జర్నలిస్టు ప్రశ్నించాడు. కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కోహ్లీ-జర్నలిస్టు మధ్య సంభాషణ ఇలా సాగింది

  • జర్నలిస్టు: విరాట్.. కివీస్‌ ఆటగాళ్లు ఔటైనప్పుడు మైదానంలో మీరు ప్రవర్తించిన తీరుపై మీ స్పందనేంటి? మైదానంలో సరిగ్గా ఉండాలని మీకు తెలియదా?
  • కోహ్లీ: మీరేమనుకుంటున్నారు?
  • జర్నలిస్టు:నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా?
  • కోహ్లీ:నేనూ మిమ్మల్నే జవాబు అడుగుతున్నా.
  • జర్నలిస్టు:మీరు మైదానంలో సరిగ్గా ప్రవర్తించాల్సింది.
  • కోహ్లీ: అక్కడేం జరిగిందో పూర్తిగా తెలుసుకొని రావాలి. అసంపూర్తి సమాచారంతో ఇక్కడకు వచ్చి మాట్లాడకూడదు. ఒకవేళ మీరు వివాదాలు సృష్టించాలనుకున్నా, ఇది సరైన వేదిక కాదు. ఈ విషయంపై నేను రిఫరీతో మాట్లాడాను. అక్కడేం జరిగిందనే దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. అనంతరం ధన్యవాదాలు అని కోహ్లీ దీటుగా బదులిచ్చాడు.

గతంలోనూ భారత జట్టు ఓటమిపాలయ్యాక మీడియా సమావేశాల్లో కోహ్లీ.. రిపోర్టర్లపై ఇలాగే విరుచుకుపడ్డాడు. 2018 ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌ ఓడిపోయినప్పుడు, తాజాగా వెల్లింగ్టన్‌ టెస్టులో పరాభవం ఎదురైన సందర్భంలోనూ జర్నలిస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Last Updated : Mar 3, 2020, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details