తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ సలహాలు మిస్సవుతున్న కోహ్లీసేన'

భారత జట్టు ధోనీ సూచనలు కోల్పోతోందని మాజీ క్రికెటర్​ కిరణ్ మోరె అన్నాడు. జట్టులో చాహల్​, కుల్​దీప్​ వంటి మెరుగైన బౌలర్లు సైతం విఫలమవుతున్న కారణంగా పలు వ్యాఖ్యలు చేశాడు.

Kiran More
'ధోనీ సలహాలు మిస్సవుతున్న కోహ్లీసేన'

By

Published : Dec 10, 2020, 5:01 AM IST

ప్రస్తుతం భారత జట్టు ఎంఎస్‌ ధోనీ సూచనలు, సలహాలను బాగా కోల్పోతోందని మాజీ క్రికెటర్‌ కిరణ్‌ మోరె అన్నాడు. అందుకే కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ వంటి యువ స్పిన్నర్లు విఫలం అవుతున్నారని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌ నిర్వహించిన పొడ్‌క్యాస్ట్‌లో ఆయన మాట్లాడాడు.

"పిచ్‌పై ఏ లెంగ్త్‌, ఏ లైన్‌లో బంతులు వేయాలో ఎంఎస్‌ ధోనీ సూచనలు చేసేవాడు. దాదాపుగా అవి హిందీలో ఉండేవి. ఇప్పుడు వికెట్ల వెనకాల ధోనీ లేడు. అందుకే టీమ్‌ఇండియా స్పిన్నర్లు ఇబ్బంది పడుతున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా ఒకప్పటిలా కనిపించడం లేదు"

-కిరణ్ మోరె, మాజీ క్రికెటర్.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కుల్‌దీప్‌ 57 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. చాహల్‌ 1/89, 0/71తో పేలవ ప్రదర్శన చేశాడు. జడ్డూ సైతం గతంలో మాదిరిగా వికెట్లు తీయడం లేదు.

ఇదీ చదవండి:ధోనీని నేనూ మిస్‌ అవుతున్నా: కోహ్లీ

'10-12 ఏళ్లు ధోనీ సలహాలు ఇచ్చాడు. విరాట్‌ కోహ్లీ డీప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు కుర్రాళ్లను నడిపించేవాడు. మహీ లేకపోవడంతో బౌలర్లతో మాట్లాడేందుకు కోహ్లీ ఇప్పుడు ఎక్స్‌ట్రా కవర్‌ లేదా మిడాఫ్‌లో ఉంటున్నాడు. ఏదేమైనా మరో ధోనీని కనుక్కోవడం కష్టం. ప్రస్తుతం పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలు వికెట్‌కీపర్లను సారథులుగా ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే వికెట్ల వెనకాల ఉండేవాడి వల్ల ప్రయోజనం ఉండటమే కారణం' అని మోరె వెల్లడించాడు.

ఇదీ చదవండి:14 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​ పర్యటనకు సఫారీలు

ABOUT THE AUTHOR

...view details