మెరుపు వేగంతో మైదానంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులను అయోమయంలోకి నెట్టేసి గోల్ కొట్టేస్తాడు ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ఇదే తరహాలో క్రికెట్లో తనదైన శైలిలో విజృంభిస్తూ.. వరుస సెంచరీలతో దూసుకెళ్తున్నాడు విరాట్ కోహ్లీ. వీరిద్దరూ వారి వారి క్రీడల్లో సత్తాచాటుతుంటారని, సాకర్‌లో రొనాల్డో ఎలాగో.. క్రికెట్లో కోహ్లీ అలాగని విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పోల్చాడు.
"ప్రాక్టీస్ కంటే నిబద్ధత వల్లే విరాట్ కోహ్లీ ఈ విధంగా ఆడుతున్నాడనుకుంటా. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కంటే విరాట్ ఎక్కువ ప్రతిభావంతుడేమీ కాదు. కానీ కోహ్లీ తనకున్న నిబద్దతతో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. నా దృష్టిలో అతడు(కోహ్లీ) క్రికెట్ ఆడుతున్న రొనాల్డో లాంటి వాడు. అతడి ఫిట్నెస్ స్థాయి, మానసిక స్థైర్యం నమ్మలేనివిధంగా ఉంటాయి." - బ్రియాన్ లారా, విండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్.
కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్‌ను ఏ తరంలోనూ మర్చిపోలేమని అన్నాడు లారా.