బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243) ద్విశతకం చేశాడు. కెరీర్‌లో రెండో డబుల్ నమోదు చేశాడు. శుక్రవారం మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మయాంక్‌ను ఇంటర్వ్యూ చేశాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ.. మయాంక్ జట్టులో స్థానం సంపాదించేందుకు రాలేదని, టీమిండియాను గెలిపించడానికే వచ్చాడని అన్నాడు. అందుకే ఈ స్థాయిలో చెలరేగుతున్నాడని ప్రశంసించాడు. అతడు ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా.. 60కిపైగా సగటుతో దూసుకెళ్తున్నాడని , జట్టును విజయ పథంలో నడిపించాలనే ఆలోచన వల్లే ఇలా ఆడగలుగుతున్నాడని కోహ్లీ చెప్పాడు.
మూడు మ్యాచ్‌ల వ్యవధిలో రెండు ద్విశతకాలు సాధించడం ఎలా ఉందని కోహ్లీ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు మయాంక్.