తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ కోరిన వ్యక్తే కోచ్ అయితే బెటర్' - కోచ్

కోచ్​గా ఎవరు కావాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అడిగే హక్కు ఉందని మాజీ క్రికెటర్​ సౌరభ్​ ​గంగూలీ అభిప్రాయపడ్డాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ నేతృత్వంలోని సలహా కమిటీ ఆగస్టులో భారత క్రికెట్​ జట్టుకు నూతన కోచ్​ను ఎంపిక చేయనుంది.

గంగూలీ

By

Published : Aug 1, 2019, 12:50 PM IST

రవిశాస్త్రినే మళ్లీ కోచ్​గా కొనసాగిస్తే తాను సంతోషిస్తానని విరాట్ కోహ్లీ ఇటీవలే అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మాజీ సారథి సౌరవ్​ గంగూలీ కూడా కోహ్లీకే మద్దతు పలికాడు. కోచ్​గా ఎవరు కావాలో విరాట్​కు అడిగే హక్కు ఉందని చెప్పాడు.

"భారత క్రికెట్​ జట్టుకు విరాట్ కోహ్లీ సారథి. కాబట్టి కోచ్​గా ఎవరు కావాలో అతడికి అడిగే హక్కు ఉంటుంది.
-సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్

2017లో రవిశాస్త్రిని కోచ్​గా ఎంపిక చేసిన కమిటీలో గంగూలీ కూడా ఓ సభ్యుడు. ప్రస్తుతం కపిల్​దేవ్ నేతృత్వంలోని సలహా బృందం టీమిండియా కోచ్​, తదితర సిబ్బంది పదవులకు నియామకాన్ని చేపట్టింది. ఆగస్ట్​ రెండో వారంలో కోచ్ ఎవరనేది ప్రకటించనుంది.

ఇది చదవండి: కోచ్​గా రవిశాస్త్రి ఉంటేనే ఉత్తమం: కోహ్లి

ABOUT THE AUTHOR

...view details